భారత్ మాతకి - జై
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 2 ||
గజముఖ వాదనా శరణు గణేశా !
పార్వతి పుత్రా శరణు గణేశా !!
మూషిక వాహన శరణు గణేశా !
మోదుగ హస్తా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
శంభు కుమారా శరణు గణేశా !
శాస్తాసోదర శరణు గణేశా !!
శంకర తనయా శరణు గణేశా !
చామర కర్ణా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
సిద్ది వినాయక శరణు గణేశా !
బుద్ధి ప్రదాయక శరణు గణేశా !!
షణ్మక సోదర శరణు గణేశా !
శక్తిసుపుత్రా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
వినుతప్రతాప శరణు గణేశా !
వామనరూప శరణు గణేశా !!
ప్రధమ పూజిత శరణు గణేశా !
పాపవినాశక శరణు గణేశా !
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 4 ||
గణేష్ మహారాజ్ కి - జై
భారత్ మాతకి - జై
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
సర్వ విగ్న వినాశకా
శాఖల విద్యాదాయకా || 2 ||
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
నిష్కళంక నిర్వికల్ప
నిత్యా సత్యదాయకా || 2 ||
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
ఏకదంతా వక్రతుండా
గణపతీ లంబోదరా || 2 ||
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
దాసాదీనో భీష్టదాతా
వాసవానుత శ్రీపదా || 2 ||
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
శ్రీకరా లక్ష్మి సామెత
సిద్దిరాజా గణపతి || 2 ||
జై గణేశా జై గణేశా
జయ జయా గణనాయకా || 2 ||
గణేష్ మహారాజ్ కి - జై
భారత్ మాతకి - జై
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా || 2 ||
చరణం 1 :-
మూషికవాహన గణనాథా
మునిజన వందిత గణనాథా
గుజ్జ రూపుడవు గణనాథా
మా గురుడవు గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
చరణం 2 :-
సిద్ది బుద్దులు గణనాథా
మాకీయవయ్యా గణనాథా
విఘ్న నాశికా గణనాథా
శుభములు మీకియ్యి గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
చరణం 3 :-
తొలిపూజ నీకే గణనాథా
ప్రీతిగా చేయుము గణనాథా
వీరాధి వీరా గణనాథా
గణముఖ శోభిత గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
చరణం 4 :-
షణ్ముఖ సోదర గణనాథా
ఏకదంత నీవు గణనాథా
ఏటేట నీపూజ గణనాథా
మా ఇంటిపై జరిపెము గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
చరణం 5 :-
వందనము య్యా గణనాథా
వక్రతుండాయ గణనాథా
సంకటహరణ గణనాథా
జ్ఞానప్రదాత గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా
చరణం 6 :-
జగములు నెలే గణనాథా
జయము నొసగురా గణనాథా
లోక పూజిత గణనాథా
లోకాలనేలే గణనాథా
శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా || 2 ||
గణేష్ మహారాజ్ కి - జై
భారత్ మాతకి - జై
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఇంతింత కాదయ్యా నీ మహిమలు
ఘనమైన పూజలు నీ కోసము
పార్వతి నందన లంభోదర
పావనరూప విగ్నేశ్వరా
కోటొక్క దండాలు గణనాథుడా
నీకు పాదాలకు నమస్కారం విఘ్నేశ్వరా
పసివాని నవ్వులు నీ నవ్వులు
చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..
నీకన్నా మాకింకా ఎవరున్నారో
నీవేకదా మాకు తొలిదైవము
కుడుములు వుండ్రాలు నీ కోసము
మా హ్రదయం హారతి నీకిద్దుము
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా || 2 ||
గణేష్ మహారాజ్ కి - జై
భారత్ మాతకి - జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
సిద్ది బుద్ది నీయవయ్య గణపయ్య స్వామి
నీకు కోటికోటి దండాలయ్య గణపయ్య స్వామి ||2||
బాద్రపద చవితినాడు ముందు పూజ నీకయ్య
జై గణేష జై జై గణేష
గరికలు, దర్భాలతోన పూజలెన్నో చేశాము
జై గణేష జై జై గణేష
కుడుములు ఉండరాళ్ళు, గారెలు బూరెలతోడ
జై గణేష జై జై గణేష
పులిహోర, పొంగళితో పాయసాలు చేసాము
జై గణేష జై జై గణేష
వడపప్పు బెల్లంతో నైవేద్యం పెట్టినాము
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
నలుగు పిండితో నిన్ను బొమ్మనే చేయంగా
జై గణేష జై జై గణేష
ద్వారముందు నీ తల్లి కాపలాగా ఉంచెనంట
జై గణేష జై జై గణేష
మహా శివున్ని ఎదురించి లోపలికి వెళ్ళకుండా
జై గణేష జై జై గణేష
కోపంతో నీ శిరస్సును ఖండనము చేయగా
జై గణేష జై జై గణేష
నీ తల్లి వేడుకొనగా గజాణుని రూపమిచ్చే
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
ముల్లోకాలన్నింటికి ఆది పూజ్యుడెవరంటూ
జై గణేష జై జై గణేష
అన్నదమ్ములిద్దరికీ ఆదిపత్య పోరు పెట్టే
జై గణేష జై జై గణేష
నారాయణ మంత్రం నామాలు చెప్పుకుంటూ
జై గణేష జై జై గణేష
తల్లిదండ్రుల చుట్టు తిరిగి పోటీలో గెలవంగ
జై గణేష జై జై గణేష
ఆది గణములకు నీవు ఆదిపతివైనావు
జై జై జై జై
కానిపాకంలో వెలసిన గణపయ్య స్వామి
నీకు ఎన్ని నామాలయ్య గణపయ్య స్వామి
గణేష్ మహారాజ్ కి - జై
భారత్ మాతాకీ - జై
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ || 2 ||
అమ్మ చేతి నాలుగు పిండి గణనాధా
నువ్వు అందంగా రూపుదిద్దే గణనాధ || 2 ||
అయ్యా శివునికద్దు చెప్పి గణనాధ
నువ్వు ఎదురులేని స్వామివైతివి గణనాధ || 2 ||
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ
తండ్రి చుట్టూ తిరిగి గణనాధ
నువ్వు గణములకు రాజువైతివి గణనాధ || 2 ||
తొలిపూజ సేతు నీకు గణనాధ
తోలి వరమియ్యవయ్యా గణనాధా || 2 ||
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ
అడవిలోన పత్రి తెచ్చి గణనాధ
నీ పూజ చేతుమయ్య గణనాధ || 2 ||
కుడుములు ఉండ్రాళ్ళు గణనాధ
నీకు ఆరగింపు సేతుమయ్య గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ
చందమామ నువ్వేనని గణనాధ
అమ్మ శాపమిచ్చే గణనాధ || 2 ||
చవితి నాడు నిన్ను కొలిచి గణనాధ
మేము చంద్రుణ్ణి చోదమయ్యా గణనాధ || 2 ||
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ || 2 ||
నువ్వు శివుడి కుమారుడవు గణనాధ
గణేష్ మహారాజ్ కి - జై
గణపతి బొప్ప - మోరియా
భారత మాత కి - జై
జయ జయ జయ వినాయక
జయ జయ జయ వినాయక జయము
నీయవా స్వామి జయము నీయవా ||2||
గణ గణ గణ గణనాయక
గుణము నీయవా సద్గుణము నీయవా ....
గజాననా శరణం గజముఖ వదనా శరణం ||2||
జయ జయ జయ వినాయక
జయ జయ జయ వినాయక జయము
నీయవా స్వామి జయము నీయవా
శ్రీ పార్వతీ తనయా శిరసాభి వందనం
హరహర ప్రియసుతుడా హృదయాభి వందనం
ప్రథమ పూజ దురంధర ప్రణమిల్లెద మయ్యా ||2||
పరమ పావనము చేయా పరుగున రావయ్యా
గజాననా శరణం గజముఖ వదనా శరణం ||2||
జయ జయ జయ వినాయక
జయ జయ జయ వినాయక జయము
నీయవా స్వామి జయము నీయవా
వక్రతుండ మహాకాయ శుభకరమే నీ నామం
ఏకదంత రూపాయ సుమధురమే నీ గానం
సిద్ది బుద్ధి విఘ్నేశ్వర భజయించెద మయ్యా ||2||
నటరాజ సుతనీవు నడిచి రావయ్యా
గజాననా శరణం గజముఖ వదనా శరణం ||2||
జయ జయ జయ వినాయక
జయ జయ జయ వినాయక జయము
నీయవా స్వామి జయము నీయవా
మహాదేవ నీయోగం మాతపిత సేవితం
మహాభల నీమార్గం అనుసరించు ఈ జగం
కాణిపాక గణాధీశ స్మరియించెద మయ్యా ||2||
కన్నెమూల గణపతి కనిఇటు రావయ్యా
గజాననా శరణం గజముఖ వదనా శరణం ||2||
జయ జయ జయ వినాయక
జయ జయ జయ వినాయక జయము
నీయవా స్వామి జయము నీయవా ||2||
గణపతి బొప్ప - మోరియా
గణేష్ మహారాజ్ కీ - జై