తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరములో పాపవినాశనం వెళ్లే దారిలో జపాలి తీర్థం గలదు. ఇది పురాణ దేవాలయాలలో ఒకటి.
పూర్వము జపాలి అనే మహర్షి శ్రీ ఆంజనేయుని అనుగ్రహముతో శ్రీరాముని దర్శనం కోరి గొప్ప తపస్సు చేసిన ప్రదేశమిది. ఈ తీర్థం సాక్షాత్తు రామబాణంతో పెల్లుబికిన గంగానది తెలియచేయబడింది. జపాలి మహర్షికి దర్శనమిచ్చిన శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంగా ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారు. ఇచట ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. జపాలి తీర్థములో స్నానం చేసిన భక్తులు పాపాల నుంచి విముక్తులవుతారు అని భక్తుల ప్రఘాడ నమ్మకము . ఈ తీర్థ చుట్టు ప్రక్కల పచ్చని కొండలతో వాటి నుంచి దూకుతున్న నీటి దారాలు, సెలయేర్లతో ఏంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
అగస్త్యమహర్షి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసినట్లు ఇది హాసం తెలుపుతుంది.
జపాలి హనుమాన్ దేవాలయం చుట్ట రామ్ కుండ్, ధ్రువ మహర్షి తీర్థం, పాపవినాశనం, ఆకాశ గంగ మరియు మరెన్నో తీర్థాలు ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి
తిరుమల బస్టాప్ నుంచి పాపవినాశనం వెళ్లే రోడ్డులో జపాలి తీర్థము ఉంటుంది. మెయిన్ రోడ్డు నుంచి 15 నిమిషాలు పాటు నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పూజకు సంబందించిన పూలు, టెంకాయలు లభిస్తాయి. జపాలి తీర్థం దేవాలయం