చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాద్ కు 23 కిలోమీటర్ల దూరములో చిలుకూరు అనే చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ మ్రొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని కొందరి భక్తుల నమ్మకము అందుకే వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చిలుకూరు గ్రామములో ఉన్నందున చిలుకూరు బాలని అంటారు. ఇది పురాతనమైన ఆలయముగా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
ఆలయ చరిత్ర : సుమారు 500 సంవత్సరాల క్రితం గొన్న మాధవరెడ్డి అనే భక్తుడు వృద్దాప్యములో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థము బయలు దేరి కొంత దూరం వెళ్లిన తరువాత ముందుకు నడవలేక అక్కడే కుప్పకూలి పోయారు. అప్పుడు స్వామివారి అతనికి ప్రత్యక్షమై నాకోసం ప్రయాసపడి ఏడు కొండలు ఎక్కిరానవసరం లేదు. చిలుకూరు సమీపములో ఉన్న పొదల్లో నా విగ్రహం కప్పబడి ఉన్నది. అక్కడ నన్ను సేవించుకుని తరించవచ్చు అని చెప్పి అదృశ్యమవడం జరిగింది.
స్వామీ వారు చెప్పిన ప్రకారం అక్కడ తవ్వి చూడగా సుందరమైన రూపములో దివ్య కాంతులతో ఉన్న శ్రీవారి విగ్రహం కనిపించింది. కొన్ని రోజులకు అక్కడే ఆలయం నిర్మించి స్వామివారి ప్రతిష్ట జరిగింది.
చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క కొన్ని ముఖ్య విశేషాలు మరియు అంశాలు ఇక్కడ ఉన్నాయి :
ప్రదక్షిణలు : ఈ ఆలయానికి ప్రతి రోజు అనేక మంది భక్తులు మొక్కులు మొక్కుకోవడానికి మరియు తీర్చుకోవడానికి వస్తుంటారు భక్తులు మొదట సందరించుకున్న వారు 11 సార్లు తరువాత తన కోరిక తీరిన తరువాత 108 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
హుండీ లేదు : బాలాజీ ఆలయంలో ఒక విశిష్టమైన లక్షణం ఏమిటంటే దానికి విరాళాల హుండీ లేదు. ఆలయ అధికారులు ఎటువంటి ద్రవ్య కానుకలను అంగీకరించరు మరియు ఆలయం కేవలం భక్తుల మద్దతు ద్వారా నిర్వహించబడుతుంది.