Telugu Adyatmika Kathalu

Telugu Adyatmika Kathalu

కంటిలో గుచ్చుకోవాల్చిన మేకు కాలిలో ఎందుకు గుచ్చుకుంది ? - ఆధ్యాత్మిక కథ

ఒక ఊరిలో దైవ భక్తుడు ఉండేవాడు. అతను ప్రతి రోజు శ్రీ రామనామం జపించనిదే ఏ పని ప్రారంభించేవాడు కాదు.

వారంలో ఒక్కరోజు తప్పకుండా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని, తరువాత కొద్దిసేపు గుడిలోనే ద్యానం చేసుకునేవాడు. ఇలా నిత్యం శ్రీ రామ జపము మరియు వారంలో ఒక్కరోజు గుడికి వెళ్ళి దైవ ధర్శనం చేసుకోవడము తన అలవాటుగా మారిపోయింది.

ఒకానొక రోజు యధావిదిగా గుడికి బయలుదేరాడు. మార్గం మద్యలో తన అరికాలిలో పెద్ద మేకు గుచ్చుకుంది. ఆ మేకు తన అరికాలు నుంచి కాలిపాదం పైవరకు వచ్చింది. రక్తం కారిపోతుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఆ భక్తుడు అక్కడే కుర్చొని బోరున ఏడవసాగాడు. తన జీవితంలో మొట్టమొదటిసారి ఇంతటి పెద్ద గాయం తగలడము వలన, దైవ ధూషణకు దిగాడు.

గుడికి వస్తుంటేనే కదా ఇలా జరిగింది. దేవుడు నన్ను పట్టించుకోవడం లేదా. ఎంతో భక్తి కలిగిన నాకు ఇలా జరిగిందేమిటి, చిన్నప్పటి నుంచి నేను నిన్నే నమ్ముకున్నానే… నిన్ను జపించని రోజు అంటూ లేదే… వారంలో ఒక్కరోజు నిన్ను దర్శనం చేసుకోకుండా ఉండలేనే… అలాంటి నాకు ఇలాంటి కష్టం పెట్టావు నీవు ఒక దేవుడివేనా...!” అంటూ దైవధూషణ చేయసాగాడు.

అదే సమయంలో ఆ దారిన వెళ్ళుతున్న ఒక సాధువు అతని మాటలు విని, అతని దగ్గరకు వచ్చి “నాయనా దైవ ధూషణ తగదు, నీకు అంతా మంచే జరిగింది" అన్నాడు సాధువు.

సాదువు మాటలకు ఆ భక్తుడు చిరాకుగా "అంతా మంచి ఎలా జరిగింది. చూస్తున్నావు కదా నాకు ఏమి జరిగిందో " అంటూ తన కాలిని చూపించాడు.

ఆ మాటలకు సాదువు చిరు నవ్వు నవ్వి, నాయనా నీవు నీ మనస్సుతో దైవ ధూషణ చేయడం లేదని నాకు తెలుసు, ఎన్నడూ రాని కష్టం వచ్చే సరికి ఇలా మాట్లాడుతున్నావు. చేసుకున్న కర్మను బట్టి కష్ట సుఖాలు రావడం పోవడం తప్పవని నీకు తెలుసుకదా.. గత జన్మలో చేసుకున్న పాప ఫలితమే ఈరోజు ఈ మేకు నీ కాలిలో గుచ్చుకుంది” అన్నాడు.

ఆ సాధువు మాటలకు బదులుగా “నేను నిత్యం నామ జపం చేస్తాను, వారములో ఒక్కరోజు క్రమం తప్పకుండా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నాను కదా… అలాంటి నాకు ఇలా జరగటం ఏమిటి స్వామి ” అని ఏడుపును అదిమిపట్టుకుంటూ అడిగాడు.

ఆ భక్తుని మాటలకు సాధువు “నాయనా చెప్పాను కదా... కారణం లేకుండా ఏదీ జరగదు. నిజానికి ఆ మేకు నీ కంటిలో గుచ్చుకోవాలసింది. అదే జరిగి ఉంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు… అలాంటిది నీ కాలిలో గుచ్చుకుంది. ఈ గాయం కొద్ది రోజులకు మాని పోతుంది. నీ భక్తి వలనే గత జన్మ పాపం నేటితో నీకు తొలగిపోయింది. అదే కంటిలో గుచ్చుకుని ఉంటే…” అంటూ సాధువు తన దారిన తను వెల్లిపోయాడు.

ఆ భక్తునికి తన నామ జపం వలన గుడిగి వెళ్ళడము వలన కలిగిన ఫలితం ఏమిటని పూర్థిగా అర్థం అయింది. ‘అవును నేను చేసుకున్న పుణ్యమే నేడు నన్ను పెద్ద గండం నుంచి బయటపడేలా చేసింది‘ - అనుకుంటూ దైవ దూషన మాని, రామ నామం మనస్సులో జపిస్తూ దైర్యం తెచ్చుకుని, కాలిలోని మేకును తోలగించి అక్కడ ఉన్న ఆకులతో కట్టుకట్టుకుని కష్టమైనా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాడు.

ఆ రోజు నుంచి ఆ భక్తుడు అందరికీ మంచి జరగాలని ఆశించి, రోజులో కొంత సమయం దైవ ప్రచారానికి కేటాయించి, తన చుట్టు ప్రక్కలవాళ్ళ చే శ్రీరామ జపం చేయిస్తూ దైవ సేవ చేయడం సాగించాడు.

అందరికీ మనవి :- ఏ పుణ్యఫలమో మానవజన్మ లభించినది. ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవడము కోసం సమయాన్ని వృద్దాచేయక రోజులో ఒక గంట గాని లేదా వారంలో ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళి వారితో శ్రీరామ జపం చేయించి దైవ సేవ చేసుకుందాము. ఈ సృష్టిలో పరమాత్మకు మించినది మరొకటి లేదు. ఆ పరమాత్మలో మనం చేరడమే మోక్షం. అందుకు దైవ సేవ కూడా ఒక మార్గం.

"శ్రీ రామ జయ రామ జయ జయ రామ"


Join With Us

Bhaarata.com

This website was launched for the welfare of the world, to walk on the spiritual path from ignorance. We will continue to move forward with your blessings.

Email ID : bhaarata.com@gmail.com
Mobile : +91 6301767565

For Enquiries / Call Back

Social Media

  • Facebook
  • Twitter
  • Youtube
© 2021 Copy Reserved - Bhaarata.com