భగవద్గీత ను లికించినది ఎవరు ?
విఘ్నేశ్వరుడు
భగవద్గీతను సంస్కృతంలో రచించినది ఎవరు ?
వేదం వ్యాస మహర్షి
భగవద్గీతను వేదం వ్యాస మహర్షి ఏ భాషలో రచించెను ?
సంస్కృతములో
భగవద్గీతకు ఆ పేరు ఎందుకు వచ్చింది ?
శ్రీ కృష్ణ పరమాత్మచే ఆలపించడము వలన
భగవద్గీత ఏ వేదం లోనిది ?
పంచమ వేదము
భగవద్గీత ఏ గ్రంధము నుంచి చెప్పబడినది ?
మహా భారతము
భగవద్గీత ను మహా భారతములోని ఏ పర్వము నుండి చెప్పదమైనది ?
భీష్మ పర్వము (6వ పర్వము )
భగవద్గీతను భీష్మ పర్వంలోని ఏ అధ్యాయము నుంచి ఏ అధ్యాయము వరకు చెప్పడమైనది ?
25వ అధ్యాయము నుంచి 42వ అధ్యాయము వరకు (18 అధ్యాయాలు )
'భగవద్గీత' ఏ సంగ్రామములో ఆవిర్భవించేను ?
కురుక్షేత్ర సంగ్రామములో ఆవిర్భవించేను
శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఏ సందర్భంలో ఉపదేశించెను ?
యుద్దానికి ముందు
భగవద్గీతను శ్రీ కృష్ణ పరమాత్మ ఎవరికీ ఉపదేశించెను ?
అర్జునుడికి
భగవద్గీతను సాక్షాత్తుగా విన్నది ఎవరు ?
అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు
భగవద్గీత లోని మొత్తము అధ్యాయాలు ఎన్ని ?
18 అధ్యాయాలు
భగవద్గీత లోని మొత్తము శ్లోకాలు ఎన్ని ?
700 శ్లోకాలు
భగవద్గీత లోని శ్రీ కృష్ణ పరమాత్మ ఉపదేశించిన శ్లోకాలు ఎన్ని ?
574 శ్లోకాలు
యోగము అనగా ఏమి ?
యోగము అనగా కలయిక
గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును ?
హేమంత ఋతువులో వచ్చును
గీతా జయంతి ఏ రోజున వచ్చును ?
మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున వచ్చును
భగవద్గీతను ఎవరు చదవచ్చు ?
భగవద్గీతను చదువుతాను ఎలాటి భేదము లేదు. ప్రతి ఒక్కరూ చదవవచ్చు. చదవాల్సిన ఏకైక గ్రంధము భగవద్గీత.
భగవద్గీతను ఏ వయస్సు వారు చదవాలి ?
వయస్సుతో బేధము లేకుండా ప్రతి ఒక్కరూ చదవ వచ్చు.
భగవద్గీత వలన ఉపయోగము ఏమిటి ?
వ్యక్తికీ తన గమ్యం తెలుస్తుంది
భగవద్గీతలోని మొదటి అధ్యాయము పేరు ?
అర్జున విషాద యోగము
భగవద్గీత మొదటి పదము ఏ శబ్దముతో ప్రారంభం అయినది ?
ధర్మ అనే శబ్దముతో
మహా భారత యుద్ధము ఎక్కడ జరిగింది ?
కురుక్షేత్రములో
కురుక్షేత్రము ఎక్కడ కలదు ?
ప్రస్తుతము హర్యానా రాష్ట్రములో అంబాలా నగరానికి దక్షిణంగా ఢిల్లీ నగరానికి ఉత్తరమున ఉన్నది
కురుక్షేత్రములో మహా భారత యుద్ధము ఎవరి మధ్య జరిగింది?
పాండవులు, కౌరవుల మధ్య మహా భారత యుద్ధము ఎవరి మధ్య జరిగింది .
పాండవులు ఎంత మంది ?
పాండవులు ఐదు మంది.
కౌరవులు ఎంత మంది ?
కౌరవులు వంద మంది .
యుద్ధం ప్రారంభానికి ముందు మొదటిసారి శంఖం పూరించింది ఎవరు ?
భీష్ముడు
శ్రీ కృష్ణార్జునులు అధిరోహించిన రథము గురించి వర్ణించండి ?
తెల్లని గుఱ్ఱములతో, సువర్ణమైన, చాలా విశాలమైన, అద్భుతమైన, తేజోవంతమైన దివ్యమైన రథము.
అర్జునుడి యొక్క ధనస్సు పేరు ఏమిటి ?
గాండీవము
శ్రీ కృష్ణ పరమాత్మ పూరించిన శంఖము పారు ఏమిటి ?
పాంచజన్యము
అర్జునుడి యొక్క శంఖము పేరు ఏమిటి ?
దేవదత్తము
భీముడు యొక్క శంఖము పేరు ఏమిటి ?
పౌండ్రము