Vigraharadhana Papama

విగ్రహారాధన పాపమా...!

కొందరు సనాతన హిందు ధర్మాని దృష్టిలో పెట్టుకుని, విగ్రహారాధన పాపమని పదే పదే అంటుంటారు. ఇపుడు విగ్రహారాధన పాపమా! కాదా! చూద్దాం.

విగ్రహారాధన అంటే ఏమిటి?

పాపము అంటే ఏమిటి?

ఈ రెండింటికి సంబందం ఏమిటి?

అసలకు విగ్రహారాదన చేస్తే పాపం ఎందుకు వస్తుంది?

ఈ విషయాలు పైన నాకు తెలుసినది కొంతవరకు వివరిస్తాను.

విగ్రహారాధన అంటే శిలలను ఆరాధించడమే కాదు, పోటోను చూసి, లేదా మనస్సులో ఒక రూపాన్ని తలుసుకుని ఆరాధించడం కూడా విగ్రహారాధనే అవుతుంది.

ఇక పాపము అంటే ప్రధానంగా పరులకు అపకారం తలపెట్టడమే కదా... మరి విగ్రహారాధన చేస్తే, పరులకు అపకారం ఎలా తలపెట్టినట్టు అవుతుంది ?

విగ్రహారాధన వలన కలిగే లాభాలు గురించి ప్రధానంగా కొన్ని తెలుసుకుందాము.

విగ్రహారాధన వలన ఆ ప్రాతంకు పర్యాటకులు రావడం జరుగుతుంది. తద్వారా అక్కడ కొన్ని కుటుంబాలుకు జీవనోపాది కలుగుతుంది.

ఉదాహరణకు : ఒక దేవాలయానికి భక్తులను తీసుకు రావడానికి ఆటో వారికి ఉపాది కలుగుతుంది, టెంకాయులు అమ్ముకుని కొందరు, పూలు పూల దండలు అమ్ముకుని మరి కొందరు, ఇలా ఒక దేవాలయం ద్వారా అనేక రకాలుగా జీవనోపాది పొందుతున్నారు కదా.... ఇలాంటి విగ్రహారాధన వలన ఎవరికి అన్యాయం జరగడం లేదు కదా.... కావున విగ్రహారాధన పాపం కాదు.

మరొక విషయం తల్లితండ్రులను, గురువులను ఆరాదించడము కూడా విగ్రహారాధన అవుతుంది కదా... ఇలాంటి ఆరాధన చేయకుండా ఎలా ఉండగలము.

రాయిని పూజిస్తారు రాయిని పూజిస్తారు అనేవారికోసం కొంచెం వివరిద్దాము. దేవున్ని చూడాలి అనే ఆలోచన మనస్సులో కలిగినవారి కోసం, రాయికి ఒక రూపం చేసి గుడిలో ప్రతిష్టించుకుని ఆరాదించుకుంటే తప్పేముంది. అంతే కాదు మనం ఆ విగ్రహాన్ని దైవ రూపంగా తలుసుకుంటూ స్నానం చేయించవచ్చు, బట్టలుతో అలంకరించవచ్చు, నయోద్యం సమర్పించవచ్చు. ఇలా దైవాన్ని తలుచుకుని ఎంతో మానసిక ఆనందాని పొందటం ఎలా పాపం అవుతుంది.

ఈ కథ అందరికీ తెలిసిందే... ఒకరోజు ఒక రాజు వివేకానందునితో విగ్రహారాధన తప్పు కదా అని అడిగారన్ట. అపుడు స్వామి వివేకానందడు భటుని తో రాజు గారి ఫోటోను తెప్పించి, ఆ పోటో పైన ఉమ్మమంటే, ఉమ్మలేక పోయాడు ఆ భటుడు. కారణం ఆ ఫోటోలో రాజుగారిని చూసుకోవడమే... ఆ విదంగా రాజుకు స్వామి వివేకానంద జ్ణానాని కలిగించాడు.

ఈ రోజుల్లో విగ్రహారాధన మహాపాపం అనేవారు ఒక్కసారి ఆలోచించుకోవాలి.

ఎందుకంటే వారు కూడా ఏదో ఒక రూపాన్ని ఆరాదిస్తూ ఉంటారు.

విగ్రహారాధన చేయకుండా ఉండటమైంటే? సర్వం త్వజించి సన్యాసం స్వీకరించిన వారే విగ్రహారాదన చేయకుండా పరమాత్మ పై దృష్టి పెట్టగలరు. అలాటి వారు, అది తప్పు ఇది తప్పు అనకుండా వారి దృష్టి పరమాత్మ పై ఉంటుంది. ఆ స్థాయికి చేరుకున్నపుడు విగ్రహారాధన ఎటూ చేయము. కావున సనాతన హిందు ధర్మాని పరోక్షంగా దూషించాలి అనుకుని, విగ్రహారాదన గురించి మాట్లాడేవారు ఈ విషయం గమనించాలి.

ఈ వీడియో ఎవరి మనస్సు నొప్పించడానికి కాదు విగ్రహారాధన పాపం కాదు అనే నా అబిప్రాయాన్ని వివరించడానికే. దీనిపైన మీ సలహాలు కామెట్లో ఇవ్వండి. తప్పక స్వీకరిస్తాము.

Join With Us

Bhaarata.com

This website was launched for the welfare of the world, to walk on the spiritual path from ignorance. We will continue to move forward with your blessings.

Email ID : bhaarata.com@gmail.com
Mobile : +91 6301767565

For Enquiries / Call Back

Social Media

  • Facebook
  • Twitter
  • Youtube
© 2021 Copy Reserved - Bhaarata.com