Matam Marite Kashalu Potaya

మతం మారితే కష్టాలు పోతాయా !?

సుఖదుఃఖాలు వస్తూ పోతుంటాయి. అంతే కాని చిన్న పాటి కష్టానికి లేదా అనారోగ్యానికి గురైనప్పుడు, ఎవరో ఆత్మజ్ఞానం లేని వారు పరిచయం అయి "మీరు ఇన్ని రోజులు పూజలు చేసారు కదా... ఏమి లాభం. ఇప్పుడు చూడు నీకు ఈ స్థితి పట్టింది. ఇపుడైనా ఆ దేవున్ని వదిలి నేను చెప్పిన దేవున్ని ప్రార్థించు, నీకు అన్నీ మంచే జరుగుతుంది" అనగానే అతని మాటలు నమ్మి తార తరాలుగా కొలుస్తున్న ఇలవేల్పుని వదిలి పెట్టి వేరే దేవున్ని కొత్తగా ఆరాధించడం మొదలుపెట్టి, ఇలావేల్పును ధూషించడము మొదలు పెట్టడం తోనే చేడు దారి పయనిచడం ప్రారంభం అవుతుంది.

నిజానికి ఇలా దేవున్ని మార్చడము వలన, లేదా మతము మారదము వలన కష్టాలు పోలేదు.

కొందరు 'నేను మతం మారాను నాకు కష్టాలు పోయాయి ' అని చెప్పడం ప్రారంభించి ఇతరులనూ మతం మారమంటుంటారు.

అది నిజం కాదు. ఎందుకంటే కష్టం వెనుక సుఖము ఉంది కనుక మతం మారే నాటికి వారికి కష్టాలు తొలగిపోయి ఉంటాయి. కాదనుకుంటే అలా మతం మారిన వారికి తరువాత ఎలాంటి కష్టం రాకూడదు కదా... మరి ఎందుకు మతం మారిన తరువాత కూడా వారికి క్షష్టాలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, పిల్లలు లేని వారు కూడా ఉంటారు, నిరు పేదలు ఉంటారు, ఎన్నెన్నో కష్టాలు వస్తున్నాయి.

కష్టాలు ఉండకూడదని కదా మతం మారింది. అయినా కష్టాలు ఎందుకు వస్తుంటాయి.

బాగా గమనిస్తే ఏ ప్రాంతం వారికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా, ధనికులకైనా నిరు పేదలకైనా సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. ఇలా వస్తూ పోతూ వుండే వాటి యందు సమ భావము కలిగి ఉండవలెను.

ఆత్మ యందు స్థితుడై సుఖధుఃఖముల రెండింటినీ మనో వికారములుగా చూచేవారు, సుఖమెట్ల వచ్చిందో ధుఃఖము కూడా అలానే వచ్చింది అని భావించి. ఈ రెండూ రాక పోకడులు కలవి అని తలసి, రెండింటినీ సమ భావముతో చూస్తారు. అలా సుఖదుఃఖాలని సమ భావంతో చూసినవారినే ధీరులు అంటారు. అలాంటి దీరులకు మోక్షమునకు అర్హులు .

ఈ సందర్బంగా భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నందు 15 శ్లోకం తెలుసుకుందాము.

శ్లోకం :-

యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ !

సమ దుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే !!

తాత్పర్యం :-

ఓ పురుషశ్రేష్టా ! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అతనిని విషయేంద్రియ సంయోగములు చలింపచేయలేవు. అతడే మోక్షానికి అర్హుడు.

Join With Us

Bhaarata.com

This website was launched for the welfare of the world, to walk on the spiritual path from ignorance. We will continue to move forward with your blessings.

Email ID : bhaarata.com@gmail.com
Mobile : +91 6301767565

For Enquiries / Call Back

Social Media

  • Facebook
  • Twitter
  • Youtube
© 2021 Copy Reserved - Bhaarata.com