Jeevitham Ante Enti

జీవితం అంటే ఏంటి ?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం చాలా వరకు కష్టం అని నా అభిప్రాయము.

ఎందుకంటే జీవితానికి అంటూ ప్రత్యేకమైన శిక్షణ ఉండదు.

జనన మరణాల మద్య గడిపే కాలమే జీవితము. ఈ జీవితం అనేది ముందు పరీక్ష రాసిన తరువాత సమాధానములు నేర్చుకున్నట్టు ఉంటుంది. అనగా కష్టంలో ఎదురయ్యే అనుభవాలు అనేక పాఠాలును నేర్పుతాయి.

అమ్మ చెప్పిన మాటలు, నాన్న చూపిన దారి, గురువు నేర్పిన పాఠం అన్నీ మనకు నిత్యం తోడై ఉన్నా... జీవితంలో అనుభవాలు కొత్తగా ఎప్పటికప్పుడు ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది. ఒక కష్టం ఎదురైనపుడు, 'ఇలాంటి కష్టం మరొక్కసారి రాకుండా చూచుకోవాలి' అని అనుకుంటాము. అయినా మనకు తెలియకుండానే మరొక్క రూపంలో మరొక సమస్య ఎదురవుతుంది. ఒక సమస్యను అధికమించగానే మరొక్క సమస్య ముందు నిలబడి సవాలు విసురుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, ఈ జీవితం ఎప్పడికప్పడు కొత్త కొత్త పాఠాలు నేర్చుతూనే ఉంటుంది.

సుఖదుఖాలు సముద్రంలో అలలు వలే వస్తూ పోతుంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నందు 'దుఖం కలిగినపుడు భాద పడటం, సుఖం కలిగినప్పుడు ఆనంద పడటం కాకుండా... ఈ సుఖదుఖాల నందు సమభావం కలిగి ఉండాలి' అని ఉపదేశించడమైనది.

ఈ జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్న వేసుకుంటే, ముందు మనలో ఆత్మ విశ్వాసం నిండుగా ఉండాలి. తనకు తాను ఏనాడూ తక్కువ అనే భావన ఉండకూడదు. ఒక సరైన లక్ష్యం ఏర్పరుచుకోవాలి. లక్ష్యాన్ని పదే పదే మార్చకూడదు. మనచుట్టూ మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి, కావున గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగాలి. వేగంగా కదులుతున్న కాలాన్ని ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి. తప్పు జరిగితే అప్పుడే సరిదిద్దుకోవాలి. అధైర్యము, దుఖము, భయము మొదలగునవి చెడుగుణములు, అవి అపకీర్తి తెస్తాయి. అలాంటి చెడుగుణములు వదలి, దైర్యముగా ఉంటూ, ప్రతి దానికీ దుఖఃపడకుండా జీవితాన్ని గడపాలి. ధర్మ మార్గంలోనే నడవాలి. అధర్మము ఏనాటికైనా అపకీర్థిని తెచ్చిపెట్టి, కష్టాల్లో నెట్టేస్తుంది. నేను నాది అలే ఆలోచనను మనస్సులో కలగకుండా, సమాజ హితము గురించి ఆలోచించే వారు సమాజంలో ఒక మంచివారుగా కీర్తింపబడతారు. ఈ విశ్వంలో ఒక మనిషి ఉనికి ఏమాత్రం ఉంది అంటే... చెప్పలేనంత చిన్నది. ఎంతో విశాలమైన నక్షత్రమే అతి చిన్నదిగా కనిపిస్తుంది. అలాంటిది మనం ఈ విశ్వంలో ఎంత భాగం ఉంటామో ఒక్కసారి గమనించాలి. అంత ఎందుకు మనకు తెలిసిన పరిదిలోనే మన ఉనికి ఎంత చిన్నదో గమనించి, అహంకారాని విడనాడాలి.

మనిషి ఒక్కడికే తన జీవితంలో మార్పులు చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాడు, కొన్ని కొన్ని మంచి మంచి నిర్ణయాలు భవిష్యత్ లో ఎంతో మందికి ఉపయోగడతాయి.

సమాజంలో గౌరవాన్ని, కీర్థిని పెంపొందించి, సన్మార్గంలో నడిపించే విధంగా తీర్చిదిద్ది మానసిక ఆనందాని ఇవ్వగలిగే ఏకైక గ్రందం భగవద్గీత. సాక్షాత్తు భగవంతునిచే ఆలపించిన ఈ గీత నందు అంతా మంచే ఉంటుంది - అంతా మనకోసమే ఉంటుంది. ఈ గీత జీవన విదానానికి ఏకైక మార్గము.

Join With Us

Bhaarata.com

This website was launched for the welfare of the world, to walk on the spiritual path from ignorance. We will continue to move forward with your blessings.

Email ID : bhaarata.com@gmail.com
Mobile : +91 6301767565

For Enquiries / Call Back

Social Media

  • Facebook
  • Twitter
  • Youtube
© 2021 Copy Reserved - Bhaarata.com