How To Prayer

దేవున్ని ఎలా ప్రార్థన లేదా పూజ చేయాలి ?

బీద ధనికి అని గాని, పామరులు పండితులు అని గాని, కులము మతము అని గాని, ప్రాంత బేదాలు గాని ఎప్పుడూ ఎక్కడా దేవుడు చూపలేదు.

ఎవరైననూ ఎలాంటివారైననూ పరిశుద్ధుడై, పరమ భక్తితో ఏది ఇచ్చినా ప్రీతితో స్వీకరిస్తానని భగవానుడు చెప్పాడు. అలా అని సంపాదనలో అంత భాగం ఇవ్వాలి, ఇంత భాగం ఇవ్వాలి అని కోరలేదు. కేవలం ఆకును గాని, పువ్వును గాని, పండును గాని, నీళ్ళుగాని పరమ భక్తితో సమర్పించితే వాటిని ప్రీతితో ఆరగించునని భగవానుడు చెప్పెను.

మలిన చిత్తముతో ఏది ఇచ్చిననూ, ఎంత ఇచ్చిననూ, స్వీకరించడు. ఉదాహరణకు భక్తి గాని, ప్రేమ గాని లేని రారాజైన దుర్యోధనుని ఆతిథ్యమును శ్రీ కృష్ణ ప్రమాత్మ స్వీకరించని విషయం అందరికీ తెలిసిందే, నిరు పేదైన కుచేలుడు పరమ భక్తితో ఇచ్చిన అటుకులను, అంతకన్నా ప్రీతితో శ్రీ కృష్ణ పరమాత్మ స్వీకరించాడు. నిజానికి ఇవన్నీ ఆ పరమాత్మకు అవసరము లేదు, ఎందుకంటే ఈ సృష్టి మొత్తం పరమాత్మలో ఉండగా అతనికి ఏమి అవసరము ఉంటుంది. అయినా మన భక్తి తో ఏది ఇచ్చిననూ అది స్వీకరిస్తాడు.

-:--:--:--:--:--:--:--:--:--:-

ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లోని తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము నందు 26వ శ్లోకం నందు వివరించాడు.

శ్లోకం :-

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి

తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః

తాత్పర్యం :-

ఎవరు నాకు భక్తితో పత్రమును(ఆకును) గాని, పుష్పమును(పువ్వును) గాని, ఫలమును (పండును) గాని, జలమును(నీరు) గాని సమర్పించినచో, అట్టి నిర్మలబుద్ది, నిష్కామ భావముగల భక్తుడు, భక్తి పూర్వకముగా సమర్పితమైన వాటిని స్వయముగా ప్రీతితో ఆరగింతును.

-:--:--:--:--:--:--:--:--:--:-

ఉపనిషత్ ల ద్వారా జరిగిన కొన్ని నిజాలను గమనిద్దాం.

ప్రేమతో పరమ భక్తితో పత్రమును సమర్పించి - విదురుడు, ద్రౌపతి ను,

పుష్పమును సమర్పించి - గజేద్రుడు,

ఫలమును సమర్పించి శబరి కృతార్థులైరి.

Join With Us

Bhaarata.com

This website was launched for the welfare of the world, to walk on the spiritual path from ignorance. We will continue to move forward with your blessings.

Email ID : bhaarata.com@gmail.com
Mobile : +91 6301767565

For Enquiries / Call Back

Social Media

  • Facebook
  • Twitter
  • Youtube
© 2021 Copy Reserved - Bhaarata.com