పల్లవి:-
మట్టి తీసావా,
మట్టి బొమ్మను చేశావా,
ప్రాణం పోసావా,
శివయ్య, మనిషిని చేశావా ||2||
చరణం:-
తల్లి గర్బమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు ||2||
పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు
మట్టి తీసావా...
నిరుపేదగా పుట్టించావు, కూటికి పేదను చేశావు ||2||
కర్మ బంధాలను ముడినేవేసి తృటిలోనే తుంచేస్తున్నావు
మట్టి తీసావా...
కోటీశ్వురుని చేశావు, కోటలేన్నో కట్టించావు || 2 ||
సిరిసంపదలను శిధిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు.
మట్టి తీసావా...
కొమరివెల్లిలో వెలిసావు, మల్లన్న నిలిశావు || 2 ||
చరణము భక్తుల కోరికలు తీర్చి కొమరవెల్లివాసుడయ్యావు
మట్టి తీసావా...
శ్రీశైలంలో వెలిసావు, మల్లికార్థునిగా నిలిశావు || 2 ||
చరణము భక్తుల కోరికలు తీర్చి శ్రీశైలవాసుడయ్యావు
మట్టి తీసావా...